Ramcharan: ముంబై విమానాశ్రయంలో కాళ్లకి చెప్పులు లేకుండా కనిపించిన రామ్ చరణ్!

  • ఓ యాడ్ షూటింగ్ కోసం ఆర్థిక రాజధానికి వచ్చిన గ్లోబల్ స్టార్
  • నల్లటి దుస్తులలో, చెప్పులు లేకుండా రామ్ చరణ్
  • రేపు సిద్ధివినాయక ఆలయ సందర్శన
RamCharan was seen in bare feet today at the Mumbai airport

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం ముంబైలో అడుగుపెట్టారు. ఆయన ప్రీమియర్ యాడ్ షూట్ కోసం దేశ ఆర్థిక రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తూ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. నల్లటి దుస్తుల్లో కనిపించారు. ప్రతి సంవత్సరం ఆయన అయ్యప్ప దీక్షను తీసుకుంటారు. మాలధారణ సమయంలో సినిమా షూటింగ్, ఇతర వ్యాపకాల్లో బిజీగా ఉన్నప్పటికీ దీక్షా పద్ధతులను తప్పకుండా పాటిస్తారు. తాజాగా ఓ యాడ్ షూట్ కోసం ముంబై వచ్చిన రామ్ చరణ్ రేపు ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించనున్నారు.
  
      
  
   


More Telugu News