Revanth Reddy: కేసీఆర్‌పై మోదీ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy responds on PM Modi comments on KCR
  • ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్న టీపీసీసీ చీఫ్
  • మోదీ నోట చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని వ్యాఖ్య
  • మోదీ-కేసీఆర్‌లది చీకటి బంధమని విమర్శ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చి ఎన్డీయేలో చేరుతానని చెప్పారన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. మోదీ నోట తన చీకటి మిత్రుడి మాట బయటకు వచ్చిందని విమర్శించారు. ఇప్పటికైనా ముసుగు తొలగి, నిజం బయటకు వచ్చిందన్నారు. మోదీ-కేసీఆర్‌ది ఫెవికాల్ బంధమని కాంగ్రెస్ చెప్పిందే నిజమైందన్నారు.

నిజామాబాద్ గడ్డపై మరోసారి ఈ బంధం బయటపడిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి మిత్రులని, ఢిల్లీలో దోస్తీ చేస్తూనే గల్లీలో కుస్తీ పడుతున్నారన్నారు. ఇన్నాళ్లు తాము చెప్పిందే నిజమైందన్నారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలని ప్రయత్నం చేసింది నిజమే... అలాగే వారిద్దరు మిత్రులేనన్నది అంతకంటే నిజమన్నారు. నిప్పులాంటి నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదన్నారు.
Revanth Reddy
KCR
Narendra Modi
Telangana

More Telugu News