Team India: ఈ వరల్డ్ కప్ లో టీమిండియాకు 'వార్మప్' లేనట్టే... నెదర్లాండ్స్ తో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వర్షార్పణం

Team India and Nederlands warm up match abandoned due to rain
  • భారత్ లో అక్టోబరు 5 నుంచి ఐసీసీ వరల్డ్ కప్
  • నేడు టీమిండియా, నెదర్లాండ్స్ వార్మప్ మ్యాచ్
  • తిరువనంతపురంలో ఎడతెరిపిలేని వర్షం
  • కనీసం టాస్ కు కూడా అవకాశం ఇవ్వని వరుణుడు
  • మొన్న ఇంగ్లండ్ తో వార్మప్ మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దు
ఎల్లుండి నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుండగా, టీమిండియాకు ఎలాంటి ప్రాక్టీసు లభించలేదు. మొన్న ఇంగ్లండ్ తో మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దు కాగా, నేడు నెదర్లాండ్స్ తో వార్మప్ మ్యాచ్ కూడా వర్షార్పణం అయింది. ఇంగ్లండ్ తో వార్మప్ మ్యాచ్ సందర్భంగా కనీసం టాస్ కు అవకాశం ఇచ్చిన వరుణుడు... ఇవాళ ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు.

టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్  స్టేడియంలో జరగాల్సిన ప్రాక్టీసు మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దయింది. ఎడతెరిపి లేని వర్షంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 

భారత్ లో అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను ఈ నెల 8న ఆసీస్ తో ఆడనుంది.
Team India
Warm Up Match
Rain
Nederlands
World Cup

More Telugu News