తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ... లోక్ సభ ఎన్నికలపై టైమ్స్ నౌ తాజా సర్వే
- టైమ్స్ నౌ సర్వేలో ఆసక్తికర అంశాలు
- తెలంగాణలో బీఆర్ఎస్ కు 9 నుంచి 11 ఎంపీ స్థానాలు వస్తాయని వెల్లడి
- ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయొచ్చన్న టైమ్స్ నౌ
- వైసీపీకి 24 నుంచి 25 స్థానాలు వస్తాయని వివరణ
ఇక, ఏపీలో లోక్ సభ ఎన్నికలపైనా టైమ్స్ నౌ ఆసక్తికర అంశాలు పంచుకుంది. ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పింది. వైసీపీ 24 నుంచి 25 లోక్ సభ స్థానాలు చేజిక్కించుకుంటుందని పేర్కొంది. ఓట్ల శాతంలో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, అదేమీ వైసీపీ క్లీన్ స్వీప్ ను అడ్డుకోలేదని టౌమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. ఒక్క స్థానంలో మాత్రం ఫలితం అటూ ఇటూగా ఉండే అవకాశాలున్నాయని, అక్కడ టీడీపీ అభ్యర్థి గెలవొచ్చని వివరించింది.