Nagabhushana: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి... కన్నడ నటుడి అరెస్ట్

Police arrests Kannada actor Nagabhushana in road accident case
  • బెంగళూరులో రోడ్డు ప్రమాదం
  • పుట్ పాత్ పై నడుస్తున్న దంపతులపైకి కారు పోనిచ్చిన నటుడు
  • దంపతులను ఢీకొట్టి ఆపై కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కారు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
కన్నడ యువ నటుడు నాగభూషణను ఓ రోడ్డు ప్రమాద ఘటనలో పోలీసులు అరెస్ట్  చేశారు. ఫుట్ పాత్ పై నడుస్తున్న దంపతులపైకి నాగభూషణ కారు పోనివ్వడంతో, మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గత రాత్రి 9.45 గంటల సమయంలో బెంగళూరులోని వసంతపుర మెయిన్ రోడ్డులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

ఘటన జరిగిన సమయంలో నటుడు నాగభూషణ ఉత్తరహళ్లి నుంచి కొంకణకుంటే వెళుతున్నాడు. మొదట దంపతులను ఢీకొట్టిన నాగభూషణ కారు, ఆ తర్వాత ఓ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. మరణించిన మహిళ వయసు 48 సంవత్సరాలు. ఆమె భర్త కృష్ణ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

నాగభూషణ నటించిన తగురు పాల్య చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కత్, బడవ రాస్కెల్, హనీమూన్ చిత్రాలతో నాగభూషణ గుర్తింపు తెచ్చుకున్నాడు.
Nagabhushana
Arrest
Road Accident
Bengaluru
Actor
Karnataka

More Telugu News