Perni Nani: చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన హరీశ్ రావు.... పేర్ని నాని స్పందన

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమన్న హరీశ్
  • ఈ వయసులో చంద్రబాబు అరెస్ట్ సరైంది కాదని వ్యాఖ్యలు
  • ఈ అల్లుళ్ల గిల్లుళ్లు అందరికీ తెలిసిందేనన్న పేర్ని నాని
  • హరీశ్ 2018లో కేసీఆర్ నే గిల్లాడని వెల్లడి
  • దాంతో హరీశ్ ను కేసీఆర్ పక్కనబెట్టేశాడని వ్యాఖ్యలు
Perni Nani reacts on Harish Rao comments

ఈ వయసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం సరైంది కాదని, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమని తెలంగాణ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు ఏమవుతాడో, కేసీఆర్ కు హరీశ్ రావు ఏమవుతాడో అందరికీ తెలిసిందేనని, నాడు ఎన్టీఆర్ కు చంద్రబాబు ఏంచేశాడో, హరీశ్ రావు కూడా కేసీఆర్ కు అదే చేస్తాడని వ్యాఖ్యానించారు. 

ఈ అల్లుళ్ల గిల్లుళ్లు అందరికీ తెలుసని పేర్ని నాని విమర్శించారు. హరీశ్ రావు 2018లో కేసీఆర్ ను గిల్లాడని, దాంతో హరీశ్ రావును కేసీఆర్ పక్కనబెట్టేశాడని పేర్కొన్నారు. కేసీఆర్ తెలివైన వాడు కాబట్టి హరీశ్ రావు ప్రయత్నాలను గుర్తించాడని వెల్లడించారు.

More Telugu News