Nara Lokesh: నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు

CID send notice to Nara Lokesh in Inner Ring Road case
  • ఢిల్లీలో గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న లోకేశ్
  • తొలుత వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన సీఐడీ అధికారులు
  • అనంతరం గల్లా  జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసుల అందజేత 
  • నోటీసులు అందాయని సీఐడీ అధికారులకు రిప్లయ్ ఇచ్చిన లోకేశ్
  • అక్టోబరు 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలన్న సీఐడీ
ఢిల్లీలో తాను ఎక్కడున్నదీ నారా లోకేశ్ స్పష్టం చేసిన నేపథ్యంలో, ఏపీ సీఐడీ అధికారులు ఈ మధ్యాహ్నం ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత వాట్సాప్ లో నోటీసులు పంపిన సీఐడీ అధికారులు, ఆ తర్వాత లోకేశ్ తాను ఎక్కడున్నదీ చెప్పడంతో గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందినట్టు లోకేశ్ సీఐడీ అధికారులకు బదులిచ్చారు. 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఈ నోటీసులు పంపారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదైంది. ఇటీవలే ఈ కేసులో ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చడం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా, తాము 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ చెప్పడంతో హైకోర్టు లోకేశ్ బెయిల్ పిటిషన్ విచారణను ముగించింది.
Nara Lokesh
Notice
CID
Inner Ring Road Case
New Delhi
TDP
Andhra Pradesh

More Telugu News