Botsa Satyanarayana: నాడు కాపులు కంచాలు మోగిస్తే చంద్రబాబు కేసులు పెట్టి వేధించారు: బొత్స

Botsa comments on Telugudesam party Motha Mogiddham programme
  • మోత మోగిద్దాం కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం
  • చంద్రబాబు కోసం ఈరోజు ప్రజలు కంచాలు మోగించాలా? అన్న బొత్స
  • ప్రజల సొమ్మును దోచుకుంది కాక మోత మోగించాలని అడుగుతున్నారని ఎద్దేవా
ఈ రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్యాలెస్ లో ఉన్న సీఎం జగన్ కు వినిపించేలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మోత మోగించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్స్ వేదికగా స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నాడు కాపులు కంచాలు మోగిస్తే ఇదే చంద్రబాబు కేసులు పెట్టి వేధించారని, కాపు ఆడపడుచులను సైతం దూషించి అవమానాలకు గురి చేశారని విమర్శించారు. అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా దొరికిపోయిన బాబు కోసం ఈరోజు ప్రజలు కంచాలు మోగించాలా? అని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంది కాక... మళ్లీ ప్రజలనే తన కోసం మోతలు మోగించాలని అడగడానికి నోరెలా వస్తోందని ప్రశ్నించారు.
Botsa Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam
Kapu
Motha Mogiddham

More Telugu News