Chandrababu: చంద్రబాబు మాజీ పీఎస్ ను సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

  • సర్వీస్ రూల్స్ అతిక్రమించారంటూ వేటు
  • పర్సనల్ టూర్ లో భాగంగా అమెరికా వెళ్లిన శ్రీనివాస్
  • ‘స్కిల్’ కేసులో శ్రీనివాస్ పైనా ఆరోపణలు
Chandrababu Ex PS Suspended from Service

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీస్ నిబంధనలను అతిక్రమించారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో పెండ్యాల శ్రీనివాస్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు డబ్బులు అందాయని సీఐడీ ఆరోపించింది. చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారంలోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీ బాధ్యతలు చూస్తున్న పెండ్యాల శ్రీనివాస్ ఇటీవల అమెరికా వెళ్లారు.

ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయలేదని, అనుమతి లేకుండానే ఆయన అమెరికా వెళ్లారని సమాచారం. నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ అధికారులు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనలకు వెళ్లాలనుకుంటే ముందుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్నాకే విదేశాలకు వెళ్లాలి. ఈ నిబంధనను అతిక్రమించడంతో పెండ్యాల శ్రీనివాస్ కు ప్లానింగ్ డిపార్ట్ మెంట్ మెమో జారీ చేసింది. అమెరికా టూర్ పై వారం రోజుల్లో వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. అయినా పెండ్యాల శ్రీనివాస్ రాకపోవడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News