Hyderabad: నిమజ్జనం తర్వాత హైదరాబాద్‌ రోడ్ల పరిస్థితి ఇదీ

Hyderabad roads dirt after Ganesh visarjan
  • రోడ్లపై  పూలు, ఆహార వ్యర్థాలు
  • శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది
  • రెండు రోజుల పాటు సాగిన నిమజ్జనం ప్రక్రియ
నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాథుల నిమజ్జనం హైదరాబాద్ లో ప్రశాంతంగా ముగిసింది. భారీ సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్‌కు పోటెత్తడంతో రెండు రోజుల పాటు నిమజ్జనం ప్రక్రియ కొనసాగింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వేలాది సంఖ్యలో గణేశ్ విగ్రహాలను లారీలు, ఇతర వాహనాల్లో యాత్రగా ట్యాంక్ బండ్, ఇతర ప్రాంతాల్లోని చెరువుల్లోకి తీసుకెళ్లే సమయంలో భక్తులు ఆడిపాడారు. విగ్రహాలను పూలతో అలంకరించారు. ప్రసాదాలను అందించారు. పలు చోట్ల టెంట్లు వేసి ప్రసాదం, ఆహార పదార్థాల పంపిణీ చేశారు. గణేశ్ విగ్రహాలు వెళ్లిన తర్వాత ఆయా ప్రాంతాలు పూలు, మిగిలిన ఆహార పదార్థాల, ప్రసాదాలు తిన్న ప్లాస్టిక్ పేట్లు రోడ్లపై పేరుకుపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వ్యర్థాలన్నింటినీ జీహెచ్ఎంసీ సిబ్బంది తీసేసి రోడ్లను శుభ్రం చేస్తున్నారు.
Hyderabad
road
vinyaka nimajjanam
dirt
ghmc

More Telugu News