నా కొడుకు ఆ తప్పు చేసి ఉండడు.. అతడే అని తేలితే కఠినంగా శిక్షించండి: ఉజ్జయిని రేప్ నిందితుడి తండ్రి
- బాధితురాలి ప్లేస్ లో తన కూతురు ఉన్నా ఇదే చెబుతానన్న రాజు సోని
- పేపర్ లో ఆ వార్త చూసి భరత్ సోనికి చెప్పానని వెల్లడి
- తనకేం సంబంధం లేనట్టు మాట్లాడాడని వివరణ
తన కొడుకు భరత్ సోని అరెస్టు గురించి ప్రస్తావిస్తూ.. భరత్ ఈ పని చేసి ఉండడనే తాను నమ్ముతున్నట్లు రాజు సోని వివరించారు. తండ్రిగా కొడుకుకు అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అయితే, కొడుకు తప్పుచేస్తే సమర్థించబోనని స్పష్టం చేశారు. భరత్ తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే ఉరి తీయాలని చెప్పారు. బాధితురాలి స్థానంలో తన కూతురు ఉన్నా కూడా ఇదే విషయం చెబుతానని వివరించాడు.
ఉజ్జయిని ఘోరానికి సంబంధించిన వార్తను చూసి కొడుకుతో దానిపై మాట్లాడానని రాజు సోని చెప్పారు. అయితే, ఆ ఘటనతో తనకేం సంబంధంలేనట్లే భరత్ ప్రతిస్పందించాడని, అనుమానాస్పదంగా ప్రవర్తించలేదని తెలిపారు. బాలికపై ఘోరంగా అత్యాచారం జరిగిందని చెప్పగా.. ఎక్కడ జరిగిందని అడిగాడని, ఆపై రోజూలాగే ఆటో తీసుకుని వెళ్లిపోయాడని రాజు సోని చెప్పారు.