Nara Lokesh: రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోంది: నారా లోకేశ్

Nara Lokesh fires on Jagan
  • అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్లపై లోకేశ్ విమర్శలు
  • గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలుతున్నాయని విమర్శలు
  • పసి పిల్లలకు ఇచ్చే పాలను కూడా వదలవా జగన్ అని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పసి పిల్లలకు ఇచ్చే పాలను కూడా వదలవా సైకో జగన్ అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జేబ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతి దాహం పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీ చేస్తూ కాలకూట విషంగా మార్చారని దుయ్యబట్టారు. 

అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటి వరకు టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను... తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 3వ తేదీన ప్యాక్ చేస్తున్నట్టుగా చెప్పబడుతున్న ఈ పాల ప్యాకెట్లకు డిసెంబర్ 2వ తేదీ వరకు ఎక్స్ పైరీ డేట్ ఉన్నా... సరఫరా చేసిన రెండు రోజులకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలుతున్నాయని చెప్పారు. ఇవి చూశాక రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోందని అన్నారు. 

Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Milk

More Telugu News