Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన 1400 ఎకరాల భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభం

  • నాన్-కోర్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి త్రైపాక్షిక అవగాహన ఒప్పందం
  • నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ కార్పోరేషన్, నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ మధ్య ఒప్పందం
  • సాంకేతిక, భూముల బదలాయింపుకు సలహాదారుగా నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్
Process for sale of vishaka steel lands

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయానికి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ప్రక్రియను ప్రారంభించింది. నాన్-కోర్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఓ త్రైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్ ల్యాండ్ మోనటైజేషన్ కార్పోరేషన్, నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌లు ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

ఒప్పందంలో భాగంగా ల్యాండ్ మోనటైజేషన్ కార్పోరేషన్ తొలి దశలో విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన 1400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టినట్లుగా సమాచారం. నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పోరేషన్ విక్రయానికి సంబంధించి సాంకేతిక, భూముల బదలాయింపుకు సలహాదారుగా వ్యవహరించనుంది.

ఈ మేరకు ఒప్పందాలపై ఆయా సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నియంత్రణలో 19,700కు పైగా ఎకరాల భూమి ఉంది. భూముల విక్రయానికి సంబంధించి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఉక్కు మంత్రిత్వ శాఖ పవర్ ఆఫ్ అటార్నీ కలిగి ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.

More Telugu News