Chandrababu: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం

  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 27న ప్రారంభమైన వాదనలు 
  • సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తోన్న ఏజీ శ్రీరామ్
  • చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు
Arguments on chandrababu bail petition in inner ring road case

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ ప్రారంభమైంది. ఈ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 27న వాదనలు జరగగా, తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ రోజుకు వాయిదా వేశారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు.

రాజధానికి సంబంధించి బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దానిని అనుసంధానించే రోడ్ అలైన్మెంట్‌లో అక్రమాలు జరిగాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఏడాది ఏప్రిల్ 27న ఫిర్యాదు ఇచ్చారు. దీంతో మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబు మొదటి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.

More Telugu News