Pakistan: లైవ్ డిబేట్‌లో ఒకరినొకరు కొట్టుకున్న పాకిస్థాన్ రాజకీయ నాయకులు

  • పీటీఐ న్యాయవాది షేర్ అప్ఝల్ మార్వత్, పీఎంఎల్-ఎన్ సెనేటర్ అఫ్నానుల్లా ఖాన్ పరస్పర దాడి
  • ఒకరినొకరు చెంపలు వాయించుకున్న వైనం 
  • వారిద్దరిని విడదీసిన టీవీ ఛానల్ సిబ్బంది
Pakistani leaders thrash each other during live debate on TV channel

పాకిస్థాన్‌లో రాజకీయ ప్రత్యర్థులు టీవీ ఛానల్ లైవ్‌లో పరస్పరం భౌతిక దాడి చేసుకున్నారు. పీటీఐ న్యాయవాది షేర్ అఫ్జల్ మార్వత్, పీఎంఎల్-ఎన్ సెనేటర్ అఫ్నానుల్లా ఖాన్ ప్రత్యక్ష ప్రసార సమయంలోనే గొడవకు దిగారు. వారిద్దరు ఒకరినొకరు చెంపలు వాయించుకోవడం, దాడి చేసుకోవడం చేశారు. వారిని వేరు చేసేందుకు టీవీ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లో ఓ టీవీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఈ రెండు పార్టీల ప్రతినిధుల మధ్య ఓ అంశంపై చర్చ వాగ్యుద్ధానికి దారి తీసింది. ఆ తర్వాత అది ఒకరినొకరు భౌతికదాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇరువురు నేతలు పరస్పరం దుర్భాషలాడుకున్నారు.

పీటీఐ న్యాయవాది మార్వాత్ తొలుత పీఎంఎల్-ఎన్ సెనేటర్ ఖాన్ పై దాడి చేశారు. దీంతో ఖాన్ అతనిని నెట్టివేయడంతో పరస్పరం దెబ్బలాడుకున్నారు. టీవీ సిబ్బంది వారిని విడదీశారు. అఫ్నానుల్లా ఖాన్ ఈ సంఘటనపై ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. పీటీఐ నాయకుడికి తాను గట్టిగా బుద్ధి చెప్పానని, ఇది ఆ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు కూడా గుణపాఠంగా మారుతుందన్నారు.

More Telugu News