whiskey consumption: స్వల్ప మోతాదులో విస్కీ తీసుకుంటే మేలు చేస్తుందా?

  • స్వల్పంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు 
  • గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది
  • వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది
  • మోతాదు మించితే దీర్ఘకాలంలో ప్రాణాంతకం
Health benefits and risks of whiskey consumption

ఆల్కహాల్ ఆరోగ్యానికి చెడు చేస్తుందని తరచుగా వింటుంటాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే చెబుతోంది. కానీ, మద్యం మోతాదు మించకుండా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ ఎన్నో అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. విస్కీని పులియబెట్టిన ధాన్యాల నుంచి తయారు చేస్తారు. 40 శాతం వరకు ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. విస్కీని స్వల్ప మోతాదులో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని, జలుబు తగ్గుతుందని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 

మంచి - చెడు

  • విస్కీలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మొక్కల ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు. ఈ పాలీ ఫెనాల్స్ గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ధమనుల గోడల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ కరిగిపోవడంతో గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.
  • విస్కీని స్వల్ప మోతాదులో తీసుకుంటే సైనస్ గ్రంధుల్లో, ఛాతీలో పేరుకున్న మ్యూకస్ తొలగిపోతుంది. దీంతో జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త నాళాలను విస్కీ వ్యాకోచించేలా చేస్తుంది. దీంతో ఛాతీ, సైనస్ గ్రంధుల్లో పేరుకున్న కఫం సులభంగా అక్కడి నుంచి జారిపోతుంది.
  • ప్లాంట్ ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు మెదడులో రసాయనాల సమతుల్యానికి తోడ్పడతాయి.  
  • విస్కీలో కార్బోహైడ్రేట్లు ఉండవు. కనుక మధుమేహులు దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదం ఉండదు.
  • ఆహారం అనంతరం విస్కీని స్వల్ప మోతాదులో తీసుకుంటే.. ఆహారం సాఫీగా జీర్ణమై పేగుల్లోకి వెళ్లిపోతుంది. 
  • విస్కీని స్వల్పంగా తీసుకునేవారికి డిమెన్షియా రిస్క్ చాలా వరకు తొలగిపోతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
  • విస్కీతో ప్రయోజనాలు అనేవి స్వల్ప మోతాదులో తీసుకున్నప్పుడే సుమా! మోతాదు మించి తాగితే అది దీర్ఘకాలంలో ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతుంటారు. ఎక్కువ మోతాదులో తాగితే లివర్ పనితీరు దెబ్బతింటుంది. కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. లివర్ సిర్రోసిస్ ఏర్పడుతుంది.
  • ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నోరు, కాలేయం, ఈసోఫాజియస్, కొలన్, పాంక్రియాటిక్ కేన్సర్లు తలెత్తే ప్రమాదం ఏర్పడుతుంది.

More Telugu News