Nara Lokesh: 'అమరరాజా టు లులూ' కథనాన్ని ట్వీట్ చేసిన నారా లోకేశ్

Nara Lokesh twitter on investments
  • పెట్టుబడిదారులు కూడా భయపడుతున్నారన్న లోకేశ్
  • ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడిదారులు కూడా జగన్ విధ్వంస నాయకత్వంలో సురక్షితంగా లేరన్న లోకేశ్
  • అమరరాజా టు లూలూ అనే ది ప్రింట్ ఇంగ్లీష్ మీడియా కథనం ట్వీట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ పాలనపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. 'అమరరాజా టు లూలూ: పెట్టుబడిదారులు ఆంధ్రా నుంచి తెలంగాణకు ఎలా వెళుతున్నారు?' అంటూ 'ది ప్రింట్' ఇంగ్లీష్ మీడియా కథనాన్ని లోకేశ్ ట్వీట్ చేస్తూ... ఉద్యోగాలు సృష్టించే పెట్టుబడిదారులు కూడా వైఎస్ జగన్ విధ్వంసక నాయత్వంలో సురక్షితంగా లేరంటూ పేర్కొన్నారు.

అబుదాబీకి చెందిన లూలూ గ్రూప్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి నిష్క్రమించిన నాలుగేళ్ల తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ మాల్‌ను ప్రారంభించిందని, ఇలా జరగడం ఈ ఒక్క ఇన్వెస్టర్ విషయంలోనే జరగలేదని ఆ కథనం పేర్కొంది. అమర్ రాజా బ్యాటరీస్, పేజ్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు కూడా గత రెండేళ్లలో ఇదే బాట పట్టాయని అందులో తెలిపారు.
Nara Lokesh
YS Jagan
Andhra Pradesh
Telangana

More Telugu News