Pakistan: గ్రిల్డ్ లాంబ్ చోప్స్, మటన్ కర్రీ, పలావ్.. హైదరాబాద్‌లో పాక్ క్రికెట్ జట్టు ఫుడ్ మెనూ!

Pakistan Teams Food Menu Upon Hyderabad Arrival Revealed
  • పాక్ జట్టు రోజువారీ ప్రొటీన్ భోజనం కోసం చికెన్, మటన్, చేపలు
  • డైట్ చార్ట్ ప్రకారం గ్రిల్డ్ లాంబ్ చొప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్
  • మెనూలో ఉడికించిన బాస్మతి బియ్యం, బోలోగ్నీస్ సాస్‌తో కూడిన స్పాగెట్టి
వీసాలు సకాలంలో క్రియరెన్స్ చేయడంతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది. భాగ్యనగరంలో బాబర్ ఆజమ్ జట్టుకు ఘనస్వాగతం లభించింది. తమకు స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులకు సంబంధించిన వీడియోలను పాక్ క్రికెటర్లు తమ సోషల్ మీడియా వేదికలపై ఆనందం పంచుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వారు బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌కు చేరుకున్నారు.

క్రీడాకారులకు ఆహారం చాలా ముఖ్యమైన అంశం. పాక్ ఆటగాళ్లకు హైదరాబాద్‌లో అద్భుతమైన వంటరుచులు చూపిస్తున్నారు. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరగనున్న వార్మప్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ ఆటగాళ్లు ఈరోజు మైదానానికి వెళ్లారు. క్రీడా అంశాన్ని పక్కన పెడితే భాగ్యనగరంలో వారు వంటను ఆస్వాదించారు. పాక్ జట్టు రోజువారీ ప్రొటీన్ భోజనం కోసం చికెన్, మటన్, చేపలు తింటున్నారు. వారి టీమ్ డైట్ చార్ట్ ప్రకారం గ్రిల్డ్ లాంబ్ చోప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ ఉన్నాయి. 

కార్బోహైడ్రేట్స్ ఫుడ్ కోసం ఉడికించిన బాస్మతి బియ్యం, బోలోగ్నీస్ సాస్‌తో కూడిన స్పాగెట్టి, వెజ్ పలావ్ వంటి వాటిని పాక్ క్రికెట్ జట్టు మెనూలో చేర్చారు. పాక్ జట్టు దాదాపు రెండు వారాల పాటు ఇక్కడ ఉంటుంది. ఈ క్రమంలో వారు హైదరాబాద్ బిర్యానీని కూడా రుచి చూడవచ్చు.
Pakistan
India
Hyderabad
Cricket
Team India

More Telugu News