Byreddy Rajasekar Reddy: నారా భువనేశ్వరిని కలిసిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి

Byreddy Rajasekhar reddy meets Nara Bhuvaneswari
  • రాజమండ్రిలో భువనేశ్వరితో రాయలసీమ నేత భేటీ
  • దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్య
  • ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరన్న బైరెడ్డి
రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి గురువారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరిని రాజమండ్రిలో కలిశారు. అనంతరం బైరెడ్డి మాట్లాడుతూ.... దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరన్నారు. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.
Byreddy Rajasekar Reddy

More Telugu News