Vijayasai Reddy: ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యాలను బతకనిస్తారా? విజయసాయిరెడ్డి

VijayaSaiReddy tweet on Chandrababu bail petition
  • రాష్ట్రపతి, ప్రధాని పదవులను ఎవరికెళ్లాలో నిర్ణయించిన వ్యక్తి చంద్రబాబు అంటూ సెటైర్
  • ఢిల్లీలో చక్రాలు తిప్పిన వ్యక్తి అంటూ విజయసాయిరెడ్డి చురకలు
  •  న్యాయం, సత్యం, ధర్మాన్ని బతకనిస్తారా బాబూ అంటూ ఎద్దేవా 
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి ఇప్పుడు బెయిల్ పైన బయటకు వస్తే సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని బతకనిస్తారా? అని తనదైన శైలిలో చురకలు అంటించారు.  

'రాష్ట్రపతి, ప్రధాని పదవులు ఎవరికెళ్ళాలో నిర్ణయించిన వ్యక్తి.... ఢిల్లీలో చక్రాలు తిప్పిన వ్యక్తి.... స్వయంప్రకటిత సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కర్త, ఆద్యుడు... సంపద సృష్టికర్తగా చెప్పుకునే మీరు.... స్కాంలు చేసి బెయిల్ పైన బయట ఉంటే సాక్ష్యాలు చెరిపేయరా? న్యాయం, సత్యం, ధర్మాన్ని బతకనిస్తారా బాబూ!' అంటూ ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Andhra Pradesh
Chandrababu

More Telugu News