Nagendranath: ఏపీ రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ కన్నుమూత

AP Raithu Samakhya president Nagendranath passes away
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగేంద్రనాధ్ కన్నుమూత
  • ఆయన వయసు 80 ఏళ్లు
  • ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా కొండురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ బాబు కన్నుమూశారు. ఆయన వయసు 80 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు. రైతు సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన ఆయన రైతు నేతగా గుర్తింపు పొందారు. కృష్ణా జిల్లా డీసీసీ బ్యాంకు డైరెక్టర్ గా కూడా ఆయన పని చేశారు. నాగేంద్రనాథ్ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కొండూరుకు తీసుకొచ్చారు.
Nagendranath
Raithu Samakhya
Andhra Pradesh

More Telugu News