BJP: తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్: బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • నిరాహార దీక్ష, ఒక చెంపపై దెబ్బకొడితే మరో చెంప చూపించడం వల్ల స్వాతంత్ర్యం రాలేదని వ్యాఖ్య
  • నేతాజీ వంటి వారు బ్రిటిషర్లను భయపెట్టడం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్న బీజేపీ ఎమ్మెల్యే
  • అంబేద్కర్ కూడా ఓ పుస్తకంలో రాశారని వెల్లడి
Nehru not Indias first Prime Minister Karnataka BJP MLAs remark sparks row

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాదని, సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. కర్ణాటకలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... మన దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కాదని, సుభాష్ చంద్రబోస్ ప్రథమ ప్రధాని అన్నారు. నేతాజీ బ్రిటిష్ వారికి భయం రుచిచూపించడం వల్ల వాళ్లు దేశాన్ని విడిచి వెళ్లిపోయారన్నారు. భారతీయులు చేసే నిరాహార దీక్షల వల్ల లేదా సత్యం, ధర్మం అంటూ ఒక చెంపపై దెబ్బ కొడితే మరో చెంప చూపించడం వల్ల కానీ స్వాతంత్ర్యం రాలేదన్నారు.

నేతాజీ వంటి వారు బ్రిటిషర్లను భయపెట్టడం వల్లే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని అంబేడ్కర్ కూడా తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ వాళ్లు భారత్‌ను వదిలి వెళ్లారన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు స్వాతంత్ర్యం ప్రకటించినట్లు చెప్పారన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు స్వాతంత్ర్యం ప్రకటించారని, ఆయా ప్రాంతాల వారికి సొంత కరెన్సీ, జెండా, జాతీయ గీతం ఉండేవన్నారు. అప్పటికి దేశ ప్రధాని ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నడిపిస్తోన్న నేతాజీ అన్నారు. అందుకే మన తొలి ప్రధాని నెహ్రూ కాదన్నారు.

More Telugu News