Nara Lokesh: దేశంలో ఎక్కువ మంది మహిళలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1: వివరాలను షేర్ చేసిన నారా లోకేశ్

Highest number of women forced into prostitution in AP says Nara Lokesh
  • ఏపీలోని మహిళలు అత్యంత పేదరికంతో బాధ పడుతున్నారన్న లోకేశ్
  • వారు అనుభవిస్తున్న పరిణామాలు తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయని వ్యాఖ్య
  • సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమయిందని విమర్శ
ఏపీలో మహిళలు అత్యంత పేదరికంతో బాధపడుతున్నారని... పేదరికంతో వారు అనుభవిస్తున్న పరిణామాలను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. మహిళలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉందని చెప్పారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించడం లేదని... ఎందుకంటే, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ సోదరీమణులకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితాలను అందించడంలో సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 

15 నుంచి 19 మధ్య వయసున్న యువతులు గర్భం దాలుస్తున్న వివరాలతో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించిన వివరాలను లోకేశ్ షేర్ చేశారు. ఈ జాబితాలో ఏపీలో 12.6 శాతం మంది టీనేజ్ యువతులు గర్భం దాలుస్తున్నట్టుగా ఉంది. జాతీయ సరాసరి శాతం 6.8 శాతంగా ఉంది.   

మన దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న వ్యభిచారం వివరాలను కూడా లోకేశ్ పంచుకున్నారు. ఇండియాలో 8.50 లక్షల మంది వ్యభిచార వృత్తిలో ఉండగా... ఏపీ నుంచే 1,33,447 మంది మహిళలు వ్యభిచారం చేస్తున్నారు. ఈ జాబితాలో కర్ణాటక, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.  
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh
Prostitution

More Telugu News