iPhone 15: ఐఫోన్ 15 లో చార్జింగ్ సమస్యలు

  • విపరీతంగా వేడెక్కుతోందని అంటున్న యూజర్లు
  • ఫోన్ మాట్లాడినా, గేమ్ ఆడినా అదే సమస్య
  • ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 15
iPhone 15 Overheating Issue Makes It Too Hot To Touch Says Users

ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 15 విపరీతంగా వేడెక్కుతోందని, ఫోన్ ను ముట్టుకోలేక పోతున్నామని కస్టమర్లు చెబుతున్నారు. చార్జింగ్ పెట్టినా, కాసేపు మాట్లాడినా లేదా గేమ్ ఆడినా కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై యాపిల్ కంపెనీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. అయితే, ఇలాంటి సమస్య ఎదురైనపుడు ఏంచేయాలనే విషయంపై గతంలో కంపెనీ ప్రచురించిన ఓ ఆర్టికల్ ను రిఫర్ చేస్తూ అందులోని సూచనలు ఫాలో కావాలంటూ యాపిల్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ చెబుతోందట.

ఈ ఆర్టికల్ లో ఐఫోన్ వేడెక్కడానికి కారణాలను పేర్కొంటూ.. ఇంటెన్సివ్ యాప్ లను వాడుతున్నపుడు, చార్జింగ్ పెట్టినపుడు, ఫస్ట్ టైం సెట్టింగ్ చేస్తున్నపుడు ఈ సమస్య ఎదురవుతుందని తెలిపింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. యాపిల్ కంపెనీ ఏటా ఆర్జించే ఆదాయంలో సగం వాటా ఐఫోన్లదే. అందుకే ఐఫోన్ కొత్త సిరీస్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుందని, అన్ని రకాల పరీక్షలు జరిపాకే మార్కెట్లోకి విడుదల చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనాల్లో ఐఫోన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పెద్ద మొత్తంలో ఫోన్లను తయారు చేస్తుందని, అంతకంటే ముందు ఫోన్ ను అన్ని రకాలుగా పరీక్షించి చూస్తుందని వివరించారు.

More Telugu News