KA Paul: చంద్రబాబు జైలు శిక్ష అనుభవించాల్సిందే: కేఏ పాల్

  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణకు సహకరించాలని సూచన
  • దేశంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని ఆరోపణ
  • టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి పెయిడ్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని వ్యాఖ్య
KA Paul comments on chandrababu arrest

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు విచారణకు సహకరించాలని ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. దేశంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అన్నారు. ఆయన ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డాడన్నారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అవినీతి ఆకాశమంత ఎత్తుకు చేరుకుందన్నారు. తండ్రి అవినీతిలో కొడుకు నారా లోకేశ్‌కు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. లక్షల కోట్ల అవినీతి చేసిన ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి పెయిడ్ ఉద్యమం నడిపిస్తున్నారన్నారు.

చంద్రబాబుకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే విచారణకు సహకరించాలని సూచించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అచ్చెన్నాయుడిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం పాతిక సీట్ల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. ప్యాకేజీ కోసం కాపులను తాకట్టు పెట్టాడని ఆరోపించారు.

More Telugu News