Chandrababu: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు

  • అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు పేరు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ అధినేత
  • నిన్న వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా
  • నేడు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తోన్న ఏజీ శ్రీరామ్
CID in AP high court in chandrababu anticipatory bail

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరుగుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నిన్న వర్చువల్‌గా వాదనలు వినిపించారు.

కాగా, అమరావతికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దానిని అనుసంధానించే రోడ్ అలైన్మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఫిర్యాదు చేశారు. దీంతో అదే ఏడాది మే 9న సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొన్నారు. ఈ కేసులోనే ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దరఖాస్తు చేశారు.

More Telugu News