Chandrababu: సుప్రీంలో చంద్రబాబు పిటిషన్‌: 'నాట్ బిఫోర్ మీ' అన్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి.. విచారణ వాయిదా

Chandrababu petition tobe changed to another bench in SC
  • విచారణకు మొగ్గుచూపని జస్టిస్ భట్టి 
  • కేసును అర్జంట్‌గా విచారించాలన్న చంద్రబాబు న్యాయవాదులు
  • సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదుల ప్రయత్నం 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది! ఇటీవల చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ ప్రారంభానికి ముందు... ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణకు మొగ్గు చూపలేదు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్ విచారణ మరో బెంచ్‌కు బదలీ అయ్యే అవకాశముంది.

విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విముఖత చూపడంతో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జంట్‌గా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపలేదు. రేపు, ఎల్లుండి కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ వచ్చే వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  
Chandrababu
Andhra Pradesh
Supreme Court
Telugudesam

More Telugu News