Vijayasai Reddy: తండ్రీ కొడుకుల ఆట ముగిసింది: విజయసాయిరెడ్డి

Father and son game is over says Vijayasai Reddy
  • చంద్రబాబు, లోకేశ్ లపై మరోసారి విజయసాయి విమర్శలు
  • యథా తండ్రి.. తథా కొడుకు అంటూ విమర్శ
  • లాయర్లకు ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ ను లోకేశ్ ఇస్తున్నారని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ లపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. యథా తండ్రి.. తథా కొడుకు అని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ఏ14గా ఉన్నారని చెప్పారు. ఢిల్లీలో లాయర్లతో లోకేశ్ భేటీ అవుతున్నారని... వారికి ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే స్కీమ్ ను ఆఫర్ చేస్తున్నారని అన్నారు. తండ్రి కేసును తీసుకుంటే, కొడుకు కేసు ఉచితమని ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకుల ఆట ముగిసిందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజయసాయి కామెంట్ చేశారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News