nara brahmani: ఏపీ వర్సెస్ జగన్‌గా ఉన్న రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారు: నారా బ్రాహ్మణి

  • ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శ
  • శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తోన్న మహిళలను వేధిస్తున్నారని ఆరోపణ
  • ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే దురుసు ప్రవర్తన అంటూ ఆగ్రహం
Nara Brahmani says people are with chandrababu

ఏపీ వర్సెస్ జగన్‌గా ఉన్న రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు వైపు ఉన్నారని నారా బ్రాహ్మణి అన్నారు. రాజమండ్రిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తోన్న మహిళలను కూడా వేధిస్తున్నారని, ఇది దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన అంగన్వాడీ మహిళల పట్ల దురుసు ప్రవర్తన ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న వారిపై దురుసు ప్రవర్తన సరికాదన్నారు.

More Telugu News