Ashwinidutt: చంద్రబాబు కోసం సినీ రంగం నుంచి మేం వచ్చాం.. రానివారి గురించి వదిలేయండి: నిర్మాత అశ్వనీదత్

Ashwinidutt meets nara bhuvaneswari and brahmini
  • చరిత్రకెక్కిన మహానాయకుడు చంద్రబాబును జైల్లో పెడతారని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో చంద్రసేన 160 సీట్లు గెలుస్తుందని ధీమా
  • ఎన్టీఆర్ బిడ్డ, మనవరాలు సాధిస్తారని వ్యాఖ్య
చంద్రబాబు కోసం తెలుగు సినిమారంగం నుంచి తాము వచ్చామని, రానివారి గురించి వదిలేయండని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. మంగళవారం ఆయన రాజమండ్రిలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చరిత్రకెక్కిన మహా నాయకుడు చంద్రబాబును ఇలా జైల్లో పెడతారని ఎవరూ ఊహించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలుస్తుందని, టీడీపీ-జనసేన విజయదుందుభి ఖాయమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, జనసేనను ఉద్దేశించి 'చంద్రసేన' అన్నారు. వీరు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నారు.

చంద్రబాబు అరెస్ట్ అంశంపై సినీ రంగానికి చెందినవారు మాట్లాడనంత మాత్రాన ఏమీ కాదన్నారు. తాము వచ్చాం కదా సినీరంగంలో కొంతమంది మాత్రమే ఉన్నారనుకోండి అన్నారు. రానివాళ్ల గురించి ఆలోచన ఎందుకని, వచ్చిన వాళ్ల గురించి ఆలోచిద్దామన్నారు. భువనేశ్వరి ఎన్టీఆర్ బిడ్డ అని, బ్రాహ్మణి ఎన్టీఆర్ మనవరాలని, వారు సాధిస్తారని, ధైర్యంగా ఉన్నారని చెప్పారు. 2024లో గొప్ప చరిత్రను చూడబోతున్నారన్నారు.
Ashwinidutt
Chandrababu
Tollywood
Andhra Pradesh
YS Jagan

More Telugu News