Gudivada Amarnath: చంద్రబాబుకు జైల్లో దోమలు కుట్టడంపై కేసీఆర్ వ్యాఖ్యలతో గుడివాడ అమర్నాథ్ చురకలు

  • ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో రూ.114 కోట్లు కొట్టేశారని ఆరోపణ
  • దోమలు సోషలిస్టులు ముఖ్యమంత్రి అయినా కేంద్రమంత్రి అయినా కుడతాయని వ్యాఖ్య
  • చంద్రబాబు ఆస్తులపై భువనేశ్వరికి ప్రశ్న
Gudiwada Amarnath satires on chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో రూ.114 కోట్లు కొట్టేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల సంపదను ఆయన ఎలా కొట్టేశాడో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఓ కేస్ స్టడీ అన్నారు. స్కిల్డ్‌గా కోట్లాది రూపాయలు కొట్టేశారన్నారు. ఏపీ ఫైబర్ నెట్ అంశంలోను డబ్బులు దోచుకున్నారన్నారు. షెల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్సుఫర్ చేశారన్నారు. హెరిటేజ్‌లో పని చేసేవారే టెరాసాఫ్టులో డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. 2016లోనే ప్రతిపక్ష నేతగా జగన్... నాటి సీఎం చంద్రబాబు అవినీతిని ఎండగట్టారన్నారు.

జైల్లో చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయని చెబుతున్నారని, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇదివరకే చెప్పారని, దోమలు సోషలిస్టులు అని, ముఖ్యమంత్రి అయినా... కేంద్రమంత్రి అయినా దోమ కుడుతుందని ఎద్దేవా చేశారు. అయినా చెత్త ఎక్కడ ఉంటే దోమలు అక్కడకు వస్తాయని, ఇప్పుడు జైల్లోని చంద్రబాబు వద్దకు వచ్చాయని సెటైర్లు వేశారు.

నిన్న నారా భువనేశ్వరి మాట్లాడుతూ తాను హెరిటేజ్‌లోని రెండు శాతం వాటా విక్రయిస్తే రూ.400 కోట్లు వస్తాయని చెప్పారని, కానీ పెళ్లికి ముందు చంద్రబాబు ఆస్తులు రెండెకరాలు అన్నారు. భువనేశ్వరిని పెళ్లి చేసుకున్నాకే పెరిగాయన్నారు. రెండెకరాల నుంచి హెరిటేజ్ లో 2 శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తున్నాయని చెబుతున్నారని, ఎలా సంపాదించారని ప్రశ్నించారు.

More Telugu News