USA: విచారణకు సహకరించాలని భారత్‌ను కోరామన్న అమెరికా

US says we have urged Indian govt to cooperate with probe
  • తాము ప్రయివేటుగా, బహిరంగంగా అభ్యర్థించామన్న అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ ప్రతినిధి
  • కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు తమకు ఆందోళన కలిగించాయని వ్యాఖ్య
  • దోషులకు శిక్షపడే దిశగా కెనడా దర్యాఫ్తు కొనసాగాలని ఆకాంక్షించిన మాథ్యూ మిల్లర్
ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి దర్యాఫ్తునకు కెనడాకు భారత్ సహకరించాలని అగ్రరాజ్యం అమెరికా సూచిస్తోంది. విచారణకు సహకరించాలని తాము భారత్‌ను ప్రయివేటుగా, బహిరంగంగా అభ్యర్థించామని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. ఈ ఘటనపై దర్యాఫ్తు జరగాలని, అలాగే దోషులకు శిక్ష పడాలన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు తమకు తీవ్ర ఆందోళన కలిగించిందని, కెనడా భాగస్వాములతో తాము టచ్‌లో ఉన్నామన్నారు. దోషులకు శిక్షపడే దిశగా కెనడా దర్యాఫ్తు కొనసాగాలని ఆకాంక్షించారు. విచారణకు భారత్ కూడా సహకరించాలని అభ్యర్థించామన్నారు.

మరోవైపు, నిజ్జర్ హత్య కేసులో దోషులను గుర్తించే దిశగా విచారణ జరగాలని కాలిఫోర్నియా ప్రతినిధుల సభ సభ్యుడు జిమ్ కోస్టా అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నిజ్జర్ హత్యపై అధికారిక బ్రీఫింగ్ కావాలని తాను హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా కోరానని, దీనిపై దర్యాఫ్తు జరిగి దోషులను బాధ్యులను చేయల్సిందే అన్నారు.
USA
Canada
India

More Telugu News