SBI MF: రూ.లక్షను రూ.27 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్

  • 19 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎస్ బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్
  • దేశ, విదేశీ స్టాక్స్ లో పెట్టుబడులు
  • దీర్ఘకాలంలో మెరుగైన రాబడులతో సత్తా చాటిన పథకం
SBI MF scheme turned Rs 1 lakh to Rs 27 lakh in 19 years

ఎస్ బీఐ ఫోకస్ట్ ఈక్విటీ ఫండ్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ పథకం ఆరంభమై 19 ఏళ్లు పూర్తయింది. ప్రారంభంలో ఈ పథకంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినట్టయితే.. అది ఏటా 18.91 శాతం చొప్పున కాంపౌండెడ్ గా పెరుగుతూ.. ఈ 19 ఏళ్లలో రూ.26.88 లక్షలుగా మారింది.  

ఈ పథకం దేశ, విదేశీ స్టాక్స్ లో పెట్టుబడులు పెడుతుంటుంది. లోతైన అధ్యయనం చేసి, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే యాజమాన్యాలు కలిగిన కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. ఈ పథకంలో రిస్క్ ఎక్కువ. కనుక ఇన్వెస్టర్లు పదేళ్లు, అంతకుమించిన కాలానికి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన 

ఈ పథకంలో పదేళ్లకు పైగా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏటా 15.66 చొప్పున రాబడులు అందించి ఉండేది. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఈ పథకంలో పదేళ్ల పాటు పెట్టుబడి పెట్టి ఉంటే రూ.12 లక్షలు కాస్తా, రూ.26.93 లక్షలు అయి ఉండేది. ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.18 లక్షలు పెట్టుబడి, రాబడులతో కలసి రూ.75.18 లక్షలుగా మారేది.

More Telugu News