Salaar: క్రిస్‌మస్‌ బరిలో సలార్.. షారుక్‌ చిత్రంతో ఢీ!

  • డిసెంబర్‌‌ 22న విడుదల కానున్న ప్రభాస్ సినిమా
  • అదే సమయంలో రాబోతున్న షారుక్ ‘డుంకీ’ 
  • రాజ్‌ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన డుంకీ
Salaar to release on 22nd December 2023

బాహుబలి తర్వాత వరుస ఫ్లాప్స్‌లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్‌‌’పై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. కెజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌ షూటింగ్ పూర్తయింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీనే విడుదల కావాల్సి ఉంది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశారు. సలార్‌‌ వచ్చే ఏడాది వేసవిలోనే వస్తుందన్న ప్రచారం జరుగుతుండగా సినిమా రిలీజ్‌ గురించి తాజా సమాచారం వచ్చింది.

ఈ సినిమా క్రిస్‌మస్‌ బరిలో నిలవనుంది. సలార్‌‌ను డిసెంబర్‌‌ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వస్తున్న ‘డుంకీ’తో పోటీ పడనుంది. పఠాన్, జవాన్‌ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న షారుక్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

More Telugu News