Musical Floating Fountains: మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ అదుర్స్.. దుర్గంచెరువు అందం రెట్టింపు!

Musical floating fountains installed in durgamcheruvu Hyderabad
  • దుర్గంచెరువులో కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా మ్యూజికల్ ఫౌంటెయిన్స్ ఏర్పాటు
  • సోమవారం నుంచి నగరవాసులకు అందుబాటులోకి వచ్చిన వైనం
  • వివిధ రంగుల కాంతుల్లో నీటిని వెదజల్లుతూ కనువిందు చేస్తున్న ఫౌంటెయిన్స్‌
హైదరాబాద్ మహానగరం కొత్త సొబగులు అద్దుకుంది. నగరంలోని దుర్గం చెరువు అందం రెట్టింపయ్యేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. కేబుల్ బ్రిడ్జికి ఇరువైపులా వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కోదాని పొడవు సుమారు 60 మీటర్లు. ప్రతిరోజూ సాయంత్రం 7 నుంచి 10 వరకూ ఈ ఫౌంటెయిన్స్ వివిధ రంగుల కాంతుల్లో నీటిని వెదజల్లుతూ నగరవాసులకు కనువిందు చేస్తాయి. ఈ మేరకు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Musical Floating Fountains
Durgamcheruvu
Hyderabad

More Telugu News