AIADMK: ఎన్డీయేకు అన్నాడీఎంకే గుడ్ బై చెప్పడంపై బీజేపీ స్పందన

BJP TN chief Annamalai response on AIADMK quitting NDA
  • ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నామని ప్రకటించిన అన్నాడీఎంకే
  • ఈ ప్రకటనపై స్పందించిన రాష్ట్ర బీజేజీ అధ్యక్షుడు అన్నామలై
  • సరైన సమయంలో పార్టీ హైకమాండ్ స్పందిస్తుందని వ్యాఖ్య
వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తరుణంలో అన్నాడీఎంకే పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు చెన్నైలో అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు సమావేశమయ్యారు. ఎన్డీయేతో, బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఈ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేశారు. ఎన్డీయే నుంచి వైదొలుగుతున్నట్టు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునుస్వామి అధికారికంగా ప్రకటించారు. 

ఈ ప్రకటన వెలువడిన తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తొలిసారి స్పందించారు. అన్నాడీఎంకే నిర్ణయంపై పార్టీ హైకమాండ్ సరైన సమయంలో స్పందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాను పాదయాత్ర చేస్తున్నానని... అన్నాడీఎంకే ప్రకటనను ఇప్పుడే చదివానని చెప్పారు. అన్నామలై పాదయాత్ర ప్రస్తుతం కోయంబత్తూరు నార్త్ నియోజకవర్గంలో కొనసాగుతోంది.
AIADMK
NDA
BJP

More Telugu News