Pakistan: హైడ్రామా తర్వాత పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు వీసాలు మంజూరు చేసిన ఇండియా

  • వారం రోజుల నుంచి పాకిస్థాన్ కు వీసాలు మంజూరు చేయని భారత్
  • ఈరోజు ఐసీసీకి లేఖ రాసిన పాక్ క్రికెట్ బోర్డు
  • 27వ తేదీ రాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరనున్న పాక్ జట్టు
India issues visas to Pakistan cricket team after high drama

వారం రోజుల నుంచి కొనసాగిన హైడ్రామా తర్వాత పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు, టీమ్ మేనేజ్ మెంట్ కు ఇండియా వీసాలను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో 27వ తేదీ రాత్రి దుబాయ్ మీదుగా పాక్ జట్టు ఇండియాకు బయల్దేరనుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకోనుంది. భారత్ వీసాలను మంజూరు చేయకపోవడంతో ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు ఈరోజు లేఖ రాసింది. ప్రపంచకప్ సమయంలో పాకిస్థాన్ పట్ల ఇండియా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని లేఖలో పీసీబీ పేర్కొంది. 29వ తేదీన హైదరాబాద్ లో ప్రాక్టీస్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా ఇంత వరకు వీసాలు మంజూరు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల అనంతరం పాక్ జట్టుకు ఇండియా వీసాలను మంజూరు చేసింది. మరోవైపు వీసాల మంజూరులో ఆలస్యం కారణంగా దుబాయ్ లో రెండు రోజుల పాటు నిర్వహించాలనుకున్న టీమ్ బిల్డింగ్ ప్లాన్ ను పాకిస్థాన్ రద్దు చేసుకుంది.

More Telugu News