Girls: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అమ్మాయిల నగ్న ఫొటోలు.. స్పెయిన్ లో దుమారం

  • స్పెయిన్ లోని ఒక నగరంలో అమ్మాయిల నగ్న ఫొటోలను రూపొందించిన వైనం
  • 11 నుంచి 17 ఏళ్ల వయసున్న అమ్మాయిల ఫొటోలు
  • వాట్సాప్, టెలిగ్రామ్ ల ద్వారా ఫొటోల షేరింగ్
AI generated images in Spain town

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రపంచ దేశాలు అందిపుచ్చుకుంటున్న వేళ... దాన్ని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా స్పెయిన్ లోని ఓ నగరంలో దారుణం చోటు చేసుకుంది. 11 నుంచి 17 ఏళ్ల వయసున్న కొంత మంది స్థానిక బాలికల నగ్న చిత్రాలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ గా మారాయి. ఈ చిత్రాలను చూసి సదరు బాలికలు, వారి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. బాధిత బాలికల్లో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ ఫొటోల గురించి 20 నుంచి 30 మంది అమ్మాయిల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నగ్న చిత్రాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించడం కలకలం రేపుతోంది.  


బీబీసీ కథనం ప్రకారం కనీసం 11 మంది అబ్బాయిలు ఈ చిత్రాలను రూపొందించడంలో ఉన్నారు. వీటిని వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ ల ద్వారా షేర్ చేశారు. ఒక యాప్ సహాయంతో ఈ ఫొటోలను క్రియేట్ చేశారు. నిందితుల్లో కొందరు తోటి విద్యార్థులు కూడా ఉన్నారు. ఫొటోలను చూపించి అమ్మాయిలను బెదిరించారని, కొందరిని డబ్బులు కూడా డిమాండ్ చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన స్పెయిన్ తో పాటు ప్రపంచదేశాల్లో దుమారం రేపుతోంది.

More Telugu News