YS Sharmila: పార్టీ విలీనంపై ఆ లోపు తేల్చేస్తాం: షర్మిల కీలక ప్రకటన

  • పార్టీ విలీనంపై సెప్టెంబర్ 30లోపు నిర్ణయం తీసుకుంటానని షర్మిల స్పష్టీకరణ
  • అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ
  • పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఉంటుందన్న షర్మిల
YS Sharmila will decide on party merger with congress within five days

పార్టీ విలీనంపై సెప్టెంబర్ 30వ తేదీ లోపు నిర్ణయం తీసుకుంటామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇతర పార్టీలో విలీనం చేయని పక్షంలో తాము ఒంటరిగా బరిలోకి దిగుతామన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సోమవారం ఆ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనం, ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

అక్టోబర్ రెండో వారం నుంచి షర్మిల ప్రజల మధ్యలో ఉండాలని కార్యాచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది. విలీనం అయినప్పటికీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యం ఉంటుందని షర్మిల హామీ ఇచ్చారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News