Chandrababu: చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు

Bhuvaneswari and Brahmini and Atchannaidu meets Chandrababu
  • రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ ద్వారా కలిసిన కుటుంబ సభ్యులు, అచ్చెన్న
  • భర్త ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న భువనేశ్వరి
  • మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడే అవకాశం
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనను కలిశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో వసతులపై చంద్రబాబును భువనేశ్వరి అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అరెస్ట్ నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న స్పందనను చంద్రబాబుకు అచ్చెన్నాయుడు వివరించినట్ట సమాచారం. వీరి సమావేశం ములాఖత్ నిబంధనల ప్రకారం 45 నిమిషాల పాటు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడే అవకాశం ఉంది.
Chandrababu
Nara Bhuvaneswari
Nara Brahmani
Atchannaidu

More Telugu News