Vijay Deverakonda: సెన్సార్ లో కట్ చేసిన సీన్లతో ఓటీటీలోకి ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Vijay Deverakonda And Samantha Kushi Movie To Be Streamed On Netflix From October 1
  • వచ్చే నెల 1న స్ట్రీమింగ్ చేయనున్న నెట్ ఫ్లిక్స్
  • ఓటీటీలో పెరగనున్న సినిమా రన్ టైం
  • విజయ దేవరకొండ, సమంతల అందమైన ప్రేమకథ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, సమంతల కాంబినేషన్ లో వచ్చిన ఖుషీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు పోటీపడగా.. భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషీ సినిమా థియేటర్లలో యావరేజ్ గా నిలిచింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఖుషి సినిమాకు ఓపెనింగ్స్ బాగానే ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో కలెక్షన్స్ తగ్గాయి. తాజాగా ఓటీటీలో ఈ సినిమా సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజ్ చేసిన దానికంటే ఈ సినిమా నిడివి పెరగనున్నట్లు తెలుస్తోంది. విజయ దేవరకొండ, సమంతల మధ్య వచ్చే పలు రొమాంటిక్ సన్నివేశాలు సెన్సార్ లో కట్ అయ్యాయి. ఓటీటీ రిలీజ్ కోసం వాటిని తిరిగి కలపనున్నారు. సెన్సార్ కట్ చేసిన సీన్స్ కలపడంతో సినిమా రన్ టైం పెరగనుందని పరిశ్రమ వర్గాల సమాచారం.
Vijay Deverakonda
Samantha
Kushi Movie
Netflix
Streaming

More Telugu News