మల్కాజిగిరిని వదిలే ప్రసక్తే లేదు: మైనంపల్లి హనుమంతరావు
- ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తారంటూ అసత్య ప్రచారం జరుగుతోందన్న మైనంపల్లి
- తనకు వ్యతిరేకంగా ఓ సిస్టమే పని చేస్తోందని ఆరోపణ
- క్యాడర్ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా వెనుకాడబోనని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో తాను మల్కాజిగిరి సెగ్మెంట్‌ను వదులుకుంటున్నట్టు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మైనంపల్లి ఆరోపించారు. మల్కాజిగిరి ప్రజలను తప్పుతోవ పట్టించడానికి, తనకు వ్యతిరేకంగా ఓ సిస్టమే పనిచేస్తుందన్నారు. తాను కుత్బుల్లాపూర్, మేడ్చల్ నుంచి పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తలో వాస్తవం లేదన్నారు. తాను, తన కుమారుడు రాజకీయలతో బతికేవారిమి కాదని, తనకు తమ కార్యకర్తలు, ప్రజలే ముఖ్యమన్నారు. క్యాడర్ కోసం ప్రాణాలిస్తానని అన్నారు. కాగా, మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.