Drone: హెరాయిన్ మోసుకెళ్తున్న డ్రోన్‌.. పాకిస్థాన్ సరిహద్దు వద్ద స్వాధీనం

  • పంజాబ్‌లోని అమృ‌త్‌సర్ జిల్లా మహువాలో ఘటన
  • వరి పొలంలో 500 గ్రాముల హెరాయిన్, డ్రోన్ స్వాధీనం
  • స్వాధీనం చేసుకున్న డ్రోన్ చైనాలో తయారైందన్న అధికారులు
Drone carrying heroin recovered near Indo Pak Border

హెరాయిన్‌ను మోసుకెళ్తున్న డ్రోన్‌ను భారత్-పాక్ సరిహద్దులో అమృత్‌సర్ జిల్లాలోని మహవా గ్రామంలోని పొలాల్లో స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో దీనిని పట్టుకున్నారు. గ్రామ శివారులోని వరి పొలంలో 500 గ్రాముల హెరాయిన్, డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 

మహవా ప్రాంతంలో డ్రోన్ కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్ వెంటనే అప్రమత్తమైంది. పంజాబ్ పోలీసులతో కలిసి దాని కోసం గాలింపు మొదలుపెట్టింది. స్వాధీనం చేసుకున్న డ్రోన్ చైనా తయారీదని, అది క్వాడ్‌కాప్టర్ (డీజేఐ మావిక్ 3 క్లాసిక్ మోడల్) అని పోలీసు అధికారులు తెలిపారు.

More Telugu News