Chandrababu: తొలిరోజు ముగిసిన చంద్రబాబు విచారణ.. 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ!

CID grills chandrababu for 7 hours on first day
  • ఏడు గంటలపాటు 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ!
  • 120 ప్రశ్నలతో చంద్రబాబు వద్దకు వెళ్లిన విచారణాధికారులు
  • చంద్రబాబు సమాధానాలను వీడియో రికార్డ్ చేసిన అధికారులు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఐడీ విచారణ తొలిరోజైన శనివారం సాయంత్రం గం.5కు ముగిసింది. రాజమండ్రి కేంద్రకారాగారంలో టీడీపీ అధినేతను ఉదయం గం.10.00 నుంచి సాయంత్రం గం.5.00 వరకు విచారించారు. దాదాపు ఏడు గంటల పాటు ఆయనకు 50 ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది. మొత్తం సీఐడీ బృందం 120 ప్రశ్నలతో వెళ్లినట్లు, అయితే ఇందులో యాభై ప్రశ్నలు మాత్రమే అడిగినట్లుగా సమాచారం. 

చంద్రబాబు సమాధానాలను వీడియో రికార్డ్ చేశారు. ప్రశ్నించే సమయంలో కేసుకు సంబంధించి ఆధారాలను టీడీపీ అధినేత ఎదుట పెట్టినట్లుగా తెలుస్తోంది. విచారణ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదితో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించినట్లుగా తెలుస్తోంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో తొమ్మిది మంది అధికారులు ప్రశ్నించారు. ఇద్దరు మీడియేటర్లు, ఒక వీడియో గ్రాఫర్ ఉన్నారు. కాగా, కోర్టు సాయంత్రం ఐదు గంటల వరకే విచారణ చేయాలని ఆదేశించింది. రేపు కూడా ఆయనను సీఐడీ విచారించనుంది.
Chandrababu
cid
Andhra Pradesh

More Telugu News