Anjali: అంజలి 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది'

  • గతంలో హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన 'గీతాంజలి'
  • ఈ రోజునే పట్టాలెక్కిన ఆ సినిమా సీక్వెల్
  • కెరియర్ పరంగా అంజలికి ఇది 50వ సినిమా
  • ఆసక్తిని రేపుతున్న ఫస్టు పోస్టర్  
Geetanjali Malli Vachindi movie update

ఒక వైపున హీరోయిన్ గా హీరోల జోడీకడుతూ వెళ్లిన అంజలి, ఆ తరువాత నాయిక ప్రధానమైన కథలను చేస్తూ వచ్చింది. అలా ఆమె చేసిన సినిమాల్లో 'గీతాంజలి' ఒకటిగా కనిపిస్తుంది. 2014లో వచ్చిన ఆ సినిమా, భారీ విజయాన్ని అందుకుంది. చాలా తక్కువ బడ్జెట్ లో చేసిన ఈ సినిమా, భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 

హారర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన 'గీతాంజలి', అంజలి కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. అలాంటివారి ఎదురుచూపు ఇప్పుడు ఫలించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సెట్స్ పైకి వెళ్లింది. 

కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమా, కెరియర్ పరంగా అంజలికి 50వ సినిమా. ఓ పాడుబడిన బంగ్లా ముందు అంజలి నేలపై చీకట్లో కూర్చుని ఉన్న ఈ పోస్టర్ చూస్తేనే సినిమాపై ఆసక్తి పెరిగిపోతోంది. ఈ రోజునే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఎమ్ వీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీవీ దర్శకత్వం వహిస్తున్నాడు.

More Telugu News