Kangana Ranaut: రేపే 'చంద్రముఖి 2' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • గతంలో సంచలనం సృష్టించిన 'చంద్రముఖి'
  • ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'చంద్రముఖి 2'
  • ప్రధానమైన పాత్రలలో కంగనా - లారెన్స్ 
  • హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల   
Chandramukhi 2 Movie Update

చాలా కాలం క్రితం వచ్చిన 'చంద్రముఖి' కథాకథనాల పరంగా .. వసూళ్ల పరంగా సంచలనం సృష్టించింది. రజనీకాంత్.. నయనతార .. ప్రభు .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా థియేటర్లకు రావడానికి 'చంద్రముఖి 2' సిద్ధమవుతోంది.

ఈ నెల 28వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు - ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కంగనా - లారెన్స్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, వడివేలు .. రాధిక .. లక్ష్మి మీనన్ .. మహిమ నంబియార్ .. శృతి డాంగే ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News