Weather alert: తెలంగాణలో నేడు, రేపు జోరుగా వర్షాలు

  • తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
  • నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసిన వైనం
  • అత్యధికంగా 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
IMD predicts moderate rains in Telangana today and tomorrow

రాష్ట్రంలో శని, ఆది వారాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో 4.4 సెంటీమీటర్లు, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 4, మంచిర్యాల జిల్లా భీమినిలో 3.5, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

More Telugu News