Ukraine: క్రిమియాపై ఉక్రెయిన్ భారీ దాడి

Russia naval center in Sevastopol attacked by ukraine
  • సెవెస్తపోల్‌లోని రష్యా నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపై మిసైల్ దాడి
  • ఉక్రెయిన్ దాడితో కేంద్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున మంటలు
  • దాడిని ధ్రువీకరించిన రష్యా, సిబ్బందిలో ఒకరు గల్లంతైనట్టు ప్రకటన
పాశ్చాత్య దేశాలు ఇచ్చిన ఆయుధ సంపత్తితో రష్యాపై ప్రతిదాడులతో విరుచుకుపడుతున్న ఉక్రెయిన్ తాజాగా సెవెస్తపోల్‌లోని రష్యా నౌకాదళ ప్రధాన కేంద్రంపై మిసైల్‌తో భారీ దాడి చేసింది. ఈ దాడిలో కార్యాలయంలో మంటలు చెలరేగాయి. తొలుత ఓ వ్యక్తి మరణించారన్న వార్తలు వచ్చినా రష్యా అధికారులు ఆ తరువాత ఓ నౌకాదళ సిబ్బంది కనిపించడం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్ దాడి చేసినట్టు కూడా ధ్రువీకరించారు. 

సెవెస్తపోల్ కార్యాలయం రష్యా నల్ల సముుద్రం నౌకాదళ ప్రధాన కేంద్రం. ఉక్రెయిన్‌పై సముద్రదాడులను రష్యా ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తుంటుంది. కాగా, దాడి తాలూకు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Ukraine
Russia

More Telugu News