Team India: స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకున్న భారత్

  • మొహాలీలో భారత్, ఆసీస్ తొలి వన్డే
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 50 ఓవర్లలో 276 పరుగులకు ఆసీస్ ఆలౌట్
  • శుభారంభం అందించిన టీమిండియా ఓపెనర్లు
  • ఓపెనర్లిద్దరినీ అవుట్ చేసిన జంపా
Team India lost 4 wickets in short span

ఆస్ట్రేలియా జట్టుతో తొలి వన్డేలో టీమిండియా కష్టాల్లో పడింది. మొహాలీలో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ 277 పరుగుల టార్గెట్ నిర్దేశించగా... ఓ దశలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 142 పరుగులు చేసింది. 

అయితే, ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా విజృంభణకు టీమిండియా ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (71), శుభ్ మాన్ గిల్ (74) అవుటయ్యారు. శ్రేయాస్ అయ్యర్  రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అయ్యర్ చేసింది 3 పరుగులే. 

ఈ దశలో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ జట్టును ఆదుకునే బాధ్యత స్వీకరించారు. అయితే, ఆడమ్ జంపా బౌలింగ్ లో రాహుల్ బతికిపోయాడు. జంపా విసిరిన బంతిని ఎలా ఆడాలో తెలియక రాహుల్ బంతిని కొద్దిగా గాల్లోకి లేపాడు. అయితే ఈ క్యాచ్ ను జంపా నేలపాలు చేయడంతో రాహుల్ కు లైఫ్ లభించింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ను ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ అవుట్ చేయడంతో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 35 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు కాగా... రాహుల్ 20, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే 90 బంతుల్లో 81 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.

More Telugu News