Chandrababu: చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో సీఐడీకి జడ్జి విధించిన కండిషన్స్ ఇవే!

  • చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
  • విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదని ఆదేశం
  • చంద్రబాబు లాయర్ల సమక్షంలో విచారణ జరగాలని కండిషన్
ACB Court conditions to CID for Chandrababu custody

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతినిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించింది. ఈ సందర్భంగా సీఐడీకి ఏసీబీ కోర్టు జడ్జి పలు కండిషన్లను విధించారు. 


ఏసీబీ కోర్టు జడ్జి కండిషన్స్:
  • విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదు
  • విచారణ వివరాలను మీడియాకు వెల్లడించకూడదు
  • కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలి
  • విచారణ అధికారుల వివరాలు ఇవ్వాలి
  • చంద్రబాబును ఆయన లాయర్ల సమక్షంలోనే విచారించాలి
  • చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
  • చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
  • చంద్రబాబు విచారణను తాము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం
  • కస్టడీ ముగిసిన వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలి.

మరోవైపు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.

More Telugu News